మృతుల కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతుని కుటుంబాన్ని బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పట్టణంలోని 14వ వార్డ్ వాస్తవ్యులు గండ్ర సమ్మిరెడ్డి తృతీయ పుత్రుడు గండ్ర బాపు రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. గురువారం రోజు జరిగిన వారి దశదినకర్మ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొక్కిరాల రాకేష్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారివెంట మాజీ ఎంపీటీసీ పాడి భగవాన్ రెడ్డి, వార్డ్ అధ్యక్షులు బండి వెంకటేష్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.
