petrol-oil-price-raised-may-2026 I మ‌రోసారి పెట్రోల్ ధ‌ర‌లు పెంపు

  • మూడోసారి పెరిగిన పెట్రోల్‌ రేట్లు
  • అంత‌ర్జాతీయ మార్కెట్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన ధ‌ర‌లు
  • క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు బారెల్ ధ‌ర 97 డాల‌ర్లు
  • నెమ్మ‌దిగా మోపుతున్న భారం

petrol-oil-price-raised-may-2026 ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, జాతీయం : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత పెట్రోల్‌పై బాదుడు ఉంటుంద‌ని అంద‌రూ ఊహించారు. అలాగే ఎన్నిక‌ల ఫ‌లితాలు అనంత‌రం పెట్రో ఉత్ప‌త్తుల‌పై ధ‌ర‌లు పెంచారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి ఆయిల్ ధ‌ర‌లు స్వ‌ల్ప తేడాలు ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వ అనుబంధ ఆయిల్ కంపెనీలు ధ‌ర‌లు పెంచాయి. ఒకే సారి పెంచితే ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నారు.

petrol-oil-price-raised-may-2026 వారం రోజుల్లో మూడోసారి పెరిగిన ధ‌ర‌లు
దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ వారంలో ఇది మూడోసారి. ఈ రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌కు బంకుల వ‌ద్ద‌కు వెళ్లిన వారు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆయిల్ కంపెనీలు వినియోగ‌దారుల‌కు వ‌రుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచారు. ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు సీఎన్‌జీ ధరను కూడా కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంచింది. 10 రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలను పెంచడం ఇది మూడోసారి.

petrol-oil-price-raised-may-2026 ఇలా పెరిగిన ధ‌ర‌లు
అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి ఆయిల్ రేట్లు పెర‌గ‌డంతో మ‌న దేశంలో కూడా పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెంచారు. ఈ నెల 15 నుంచి ప్రారంభ‌మైన పెంపు అలానే కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టికి మూడు సార్లు పెంచారు. మే 15న పెట్రోల్, డీజిల్ పై ఎవ‌రేజ్‌గా మూడు రూపాయ‌లు పెంచారు. అలాగే మే 19న పెట్రోల్‌పై 86 పైస‌లు, డీజిల్‌పై 83 పైస‌లు పెంచారు. ఈ రోజు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ మారకపు విలువలో మార్పులు, రూపాయి విలువ దిగ‌జారిపోవ‌డం త‌దిత‌ర కార‌ణాలతో ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతున్నా ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మొత్తంగా చూసే ఇటీవ‌ల కాలంలో లీట‌ర్‌పై ఐదు రూపాయ‌ల వ‌ర‌కు పెరిగింద‌ని చెప్పొచ్చు.

petrol-oil-price-raised-may-2026 ప‌లు దేశాల్లో పెట్రోల్ ధ‌ర‌లు

దేశం లీట‌రు రేటు (ఇండియా క‌రెన్సీలో)
ఇరాన్ 2.77
వెనుజుల 3.99
సౌది 60.15
యూఏఈ 93.63
ఆఫ్ఘానిస్తాన్ 98.52
శ్రీ‌లంక 106.91
భూట‌న్ 105.89
బంగ్లాదేశ్ 110.49
అమెరికా 123.04
ఆస్ట్రేలియా 126.69
చైనా 132.96
కెనాడ‌లో 152.96
ర‌ష్యా 92.85

petrol-oil-price-raised-may-2026 అంత‌ర్జాతీయ మార్కెట్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన ముడి ఆయిల్‌
అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు బారెల్ ధ‌ర 97 డాల‌ర్ల వ‌ద్ద ఈ రోజు స్థిరంగా ఉంది. గత కొన్ని రోజులుగా చిన్న మార్పులు మాత్రమే జ‌రిగాయి. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ బారెల్ కి 103.940 డాల‌ర్లు ఉంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బారెల్ కి 96 డాల‌ర్ల‌ వద్ద ఉంది. జియోపాలిటికల్ ఒత్తిళ్లు తగ్గుతూ ఉంటే కూడా కొంత అస్థిరత కొనసాగుతోంది. ఈ వారం WTI క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 4% కంటే ఎక్కువగానే తగ్గి ఉన్నప్పటికీ, అమెరికా, ఇరాన్ మధ్య డిప్లమాటిక్ చర్చలు కొనసాగుతున్నందున ఇంకా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరల చరిత్రలో 2008 జులైలో బారెల్ 147.27 డాల‌ర్ల ధ‌ర ప‌లికింది. గ‌త నెల‌లో ధ‌ర 1.20% పెరిగింది. గ‌త వారంతో పోలిస్తే WTI లో 4% త‌గ్గింది. గ‌త వారం వంద డాల‌ర్లు ఉంటే ప్ర‌స్తుతం 96 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ సుమారుగా 3% తగ్గుదల క‌నిపించింది.

petrol-oil-price-raised-may-2026 ధ‌ర‌లు నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి
భార‌త్ లాంటి వ‌ర్ధ‌మాన దేశాల్లో ఆయిల్ ధ‌ర‌ల‌పై ప్ర‌జా జీవ‌నం ముడిప‌డి ఉంది. ఇంధన ధరలు పెరగడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే సాధారణ జీవన వ్యయం కూడా అధికమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌డంతో అన్ని ర‌కాల వ‌స్తువుల‌పై ధ‌ర‌లు పెరిగిపోతాయి. త‌ద్వారా కొనుగోలు శ‌క్తి ప‌డిపోతుంది. ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌క‌ముందే ఇంధన ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ :  హెచ్-1బీ పై నిబంధ‌న కొర‌ఢా

ALSO READ : డ్రాగ‌న్ దూకుడు!

ALSO READ ఎబోలా అలెర్ట్‌!