Ebola Alert-India-Delhi Air Port I 2105 I ఎబోలా అలెర్ట్!
- ఇండియాతోపాటు అన్ని దేశాలు అప్రమత్తం
- ప్రాణాంతకమైన ఎబోలా రాకుండా చర్యలు
- ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న వైరస్
- ఎబోలా మరణాల రేటు 50 శాతం
- వైరస్ సోకితే చికిత్స లేదు…
- ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే
- వైరస్ స్పీడ్‌గా విజృంభిస్తోంది
- టీకాలు తయారు చేసేదెన్నడో?
- ఇండియా-ఆఫ్రికా సదస్సు వాయిదా
ఇండియా-ఆఫ్రికా సదస్సు వాయిదా
Ebola Alert-India-Delhi Air Port I 2105 I ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయం : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా ఏ రూపంలో దాడి చేస్తున్నదో అని అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన హెల్త్ ఎమర్జెన్సీతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. 2019లో పుట్టుకు వచ్చిన కరోనా వైరస్ ఏడాది తర్వాత ప్రపంచ మొత్తం అల్లుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అల్లోకల్లోలమైన సంగతి తెలిసిందే. అయితే ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఎప్పుడు ఏ రకంగా విరుచుకుపడుతుందో అనే భయం మాత్రం అందరిలో ఉంది. 1974 నుంచి వ్యాపిస్తున్న ఈ వ్యాధికి టీకా కూడా తయారు చేయలేదు. వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఏకైక మార్గం

Ebola Alert-India-Delhi Air Port I 2105 I ప్రాణాంతకమైన వైరస్…
కొత్త బుండిబుగ్యో రకం ఎబోలా కోసం ప్రస్తుతం టీకా గానీ, ప్రత్యేక చికిత్స గానీ లేవు. గత 50 ఏళ్లలో ఆఫ్రికా దేశాల్లో 15,000 మందికి పైగా ఈ వ్యాధిన బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 2013–2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో జరిగిన ఎబోలా వ్యాప్తి కనీసం 11,000 మంది మరణించారు. తాజాగా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) పరిధిలో ఉత్తర-తూర్పు ప్రాంతాలు, ప్రావిన్స్‌తోపాటు ఉగాండా, సౌత్ సూడాన్ సరిహద్దులకు సమీపంలో ఈ వ్యాధి విజృంభిస్తున్నది.
ప్రధానంగా ఈ సరిహద్దులో గోల్డ్ మైనింగ్ హబ్ కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఇక్కడే పనిచేస్తుంటారు. అలాగే ప్రజలు నిత్యం సరిహద్దులు దాటుతుంటారు. వైరస్ DRCకి చెందిన పక్కప్రాంతాలకు అంటే 200 కిలోమీటర్ల (125 మైళ్ళ) దూరంలోకి కూడా వ్యాప్తి చెందింది. ఇప్పటికే 513 అనుమానాస్పద కేసుల్లో 131 మంది మరణించారు. కేవలం 24 గంటల్లో 26 కొత్త కేసులు కనిపించాయి. దీనిబట్టి ఈ వ్యాధి ఎంత స్పీడ్‌గా విస్తరిస్తున్నదో అర్థమవుతుంది. ఉగాండాలో కనీసం ఒకరు మరణించారని, ఇంకా ఇద్దరు కొత్తగా వైరస్ ఇన్ఫెక్షన్ పొందారు. ఉగాండా ప్రభుత్వ ప్రతినిధి అలన్ కసుజ్జా 120 మందికి పైగా క్వారంటైన్లో ఉన్నారు.

Ebola Alert-India-Delhi Air Port I 2105 I 50 శాతం మరణాల రేటు
ఎబోలా వ్యాధి మరణాల రేటు 50 శాతం వరకు ఉండవచ్చు. ఈ వైరస్ సోకిన 24 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ( DRC)తోపాటు ఉగాండాలో కొత్త, అరుదైన రకానికి చెందిన ఎబోలా వ్యాప్తి కనిపించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించి “అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి”గా ప్రకటించబడింది. కొంత వైరస్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కూడా వైద్య నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు.

Ebola Alert-India-Delhi Air Port I 2105 I ఢిల్లీ ఎయర్పోర్టు అధికారులు అడ్వయిజరీ జారీ
పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు అడ్వయిజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించినా స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలన్నారు.

Ebola Alert-India-Delhi Air Port I 2105 I ఎబోలా టీకా ఎప్పుడు వస్తుంది?
ప్రాణాంతకమైన ఎబోలా వ్యాధి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ఆఫ్రికా దేశాలతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతానికి ఆఫ్రికా దేశాలకు పరిమితమైన ఎబోలా ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరించే అవకాశాలు లేకపోలేదు.
“టీకా అభివృద్ధి సమయరేఖను అంచనా వేయడం కష్టతరం. శాస్త్ర సమూహం కొత్తగా ప్రారంభించడం లేదు. ఎందుకంటే గత ఎబోలా టీకా పరిశోధనల నుండి ఇప్పటికే విస్తృత పరిజ్ఞానం ఉంది. క్లినికల్ ట్రయల్స్, తయారీ, నియంత్రణ సమీక్ష, పంపిణీకి సమయం పడుతుంది. ముఖ్యంగా పరిమిత వనరుల ఉన్న ప్రాంతాల్లో వ్యాప్తి జరుగుతుందడంతో నిధులు కొరత వెంటాడుతుంది.
Ebola Alert-India-Delhi Air Port I 2105 I ఆఫ్రికా దేశస్థుల రాకను నిలిపి వేసిన వైనం
ఎబోలా వైరస్ విజృంభిస్తుండడంతో ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణికులు రాకుండా 30 రోజులు అంక్షలు పెట్టాయి. కొన్ని దేశాలు, బహరైన్, సౌత్ సూడాన్, DRC, ఉగాండా నుండి వచ్చే విదేశీ ప్రయాణీకుల ప్రవేశాన్ని 30 రోజులకు నిలిపివేశాయి. రువాండా కూడా డీఆర్సీ తో సరిహద్దును మూసేసింది. ఆసియా దేశాలు సరిహద్దు తనిఖీ పెంచాయి, క్వారంటైన్ సిద్ధం చేశాయి.

Ebola Alert-India-Delhi Air Port I 2105 I ఇండియా-ఆఫ్రికా సదస్సు వాయిదా
న్యూఢిల్లీలో ఈ నెల 28 జరగాల్సిన నాల్గవ ఇండియా-ఆఫ్రికా సదస్సును వాయిదా పడింది. ఎబోలా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సదస్సును వాయిదా వేశారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎబోలా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్రికా యూనియన్, భారత ప్రభుత్వం పరస్పర చర్చల తర్వాత ఈ సదస్సును తర్వాతి తేదీ ప్రకటిస్తాయి. ఈ సదస్సులో భారత్, ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, రక్షణ వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ముఖ్యమైన వేదికగా రూపొందించారు.
