Thorrur | బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు

Thorrur | బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు

  • బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
  • భూపతి పద్మ కుటుంబానికి భరోసా కల్పించిన నాయకులు

తొర్రూరు, ఆంధ్రప్రభ: మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన భూపతి పద్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ఆర్థిక, సామాజిక భరోసా కల్పించారు.

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు వెలికట్ట గ్రామ 5వ వార్డు సభ్యులు శారద-కుమారస్వామి బాధిత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబ అవసరాల కోసం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డిల సహకారంతో బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అల్లంనేని అనిల్‌రావు, వార్డు సభ్యులు వీరమనేని రమేష్‌రావు, భోగ సుజాత, వడ్లకొండ ఎల్లమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.