New H-1B Policy-USA-USCIS I 2305 I హెచ్-1బీ పై నిబంధ‌న కొర‌ఢా

  • గ్రీన్‌కార్డు కోరే వ‌ల‌స‌దారులు స్వదేశం నుంచి ద‌ర‌ఖాస్తు
  • యూఎస్ సీఐఎస్ సూచ‌న‌
  • లక్ష‌లాది మంది ఉద్యోగుల‌పై ప్ర‌భావం
  • చ‌ట్ట‌ప‌ర‌మైన స‌వాళ్లు ఎదుర్కొనే అవ‌కాశం
  • సాంకేతిక ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌తికూల ప్ర‌భావం
  • హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 38.5 శాతం త‌గ్గుద‌ల‌

New H-1B Policy-USA-USCIS I 2305 I ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, అంత‌ర్జాతీయం : అమెరికాలో శాశ్వ‌త నివాస హ‌క్కు (గ్రీన్ కార్డు) కోరే వ‌ల‌స‌దారుల‌పై నిబంధ‌న‌ల పేరుతో కొర‌ఢా ఝుళిపించారు. యూఎస్ సీఐఎస్ ఇచ్చిన సూచ‌న‌లు ల‌క్ష‌లాది మంది వ‌ల‌స ఉద్యోగుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. వ‌చ్చే ఏడాది గ్రీన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య భారీగా త‌గ్గింది. ఈ నిబంధ‌న‌ల‌తో మ‌రిన్ని ద‌ర‌ఖాస్తులు త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కుల అంచ‌నా. ఈ నిబంధ‌న‌ల‌తో చ‌ట్ట‌ప‌ర‌మైన స‌వాళ్లు ఎదుర్కొనే అవ‌కాశం ఉంద‌ని అమెరికాలోని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిబంధ‌న‌లు కోర్టులో నిల‌బ‌డ‌క‌పోవ‌చ్చు అనే అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి. సాంకేతిక ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌తికూల ప్రభావం చూపుతుంద‌న్న ఆందోళ‌న కూడా ఉంది.

New H-1B Policy-USA-USCIS I 2305 I యూఎస్ సీఐఎస్ నిబంధ‌న‌లు
అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్ కార్డు) కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై H1-B దరఖాస్తులు స్వ‌దేశం నుంచి స‌మ‌ర్పించాల‌ని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) సూచించింది. ఈ మేర‌కు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వలస విధానంపై స్పష్టత ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కహ్లర్ పేర్కొన్నారు. అమెరికాలో తాత్కాలికంగా ఉంటున్న విదేశీయులకు గ్రీన్‌కార్డు కావాలంటే ఇకపై వారు తమ మాతృదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే. అసాధారణ పరిస్థితుల్లోనే ఇందుకు మినహాయింపు ఉంటుందని ఆయన వివరించారు. అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాక్ కహ్లర్ చెప్పారు. ఈ మేరకు కొత్త పాలసీ మెమోను యూఎస్ సీఐఎస్ ప్రకటించింది.

New H-1B Policy-USA-USCIS I 2305 I అసాధార‌ణ ప‌రిస్థితుల్లో
అసాధారణ పరిస్థితుల్లో అమెరికా నుంచే ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’కు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది. అలాంటి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకొనే వారి విషయంలో అధికారులు అన్ని పత్రాలను క్షుణ్నంగా పరిశీలించిన త‌ర్వాత‌ తగిన నిర్ణయం తీసుకుంటారు. ఈ విధానం వల్ల వలస వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. చట్టంలోని లోపాలను ఉపయోగించుకుంటూ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గుతాయి. గ్రీన్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైనా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారిని గుర్తించి, తొలగించే అవసరం తగ్గుతుంది” అని జాక్ కహ్లర్ అన్నారు. విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు, టూరిస్టు వీసా మీద అమెరికాకు వచ్చినవారు తమ పని పూర్తికాగానే దేశాన్ని వీడి వెళ్లాలి. గ్రీన్కార్డు హోదా పొందడానికి వారి పర్యటన తొలి అడుగులా మారకూడదన్నది ఈ విధాన‌మ‌ని కహర్ వివరించారు.

New H-1B Policy-USA-USCIS I 2305 I ల‌క్ష‌లాది మంది వ‌ల‌స ఉద్యోగుల‌పై ప్ర‌భావం
అమెరికాలో ఉన్న‌ లక్షల మంది వ‌ల‌స ఉద్యోగులపై ప్రభావం ప‌డుతుంది. వలస స్థితి మార్పుల విషయంలో మ‌రోసారి చెప్పడం మాత్రమే అని యూఎస్ సీఐఎస్ ప్రతినిధి పేర్కొన్నారు. పరిపాలన విధాన మార్పు, ఇది దరఖాస్తుదారులకు అనేక సంవత్సరాల ఆలస్యం ఏర్పరచే అవకాశం కలిగించవచ్చు. చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఒక పరిక్షణతో, ఒక చట్టాన్ని రద్దు చేయలేర‌ని అమెరికాలో ఓ న్యాయవాది టాడ్ పోమర్లూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇది చట్టవిరుద్ధం, అలాగే కోర్టులో ఇది రద్దు చేయబడుతుంద‌ని పేర్కొన్నారు.

New H-1B Policy-USA-USCIS I 2305 I సాంకేతిక ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌తికూల ప్ర‌భావం
అమెరికా యూఎస్ సీఐఎస్ తీసుకున్న నిర్ణ‌యం సాంకేతిక పరిశ్రమల‌కు ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉన్నత నైపుణ్య వీసా హోల్డర్స్ ప్రభావితం చూపిస్తే శాస్త్రజ్ఞులు, AI స్టార్టప్‌లు ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అమెరికాలోని విమర్శకులు అన్నారు. ఇది హానికరమైన చర్య అని LinkedIn సహ-స్థాపకుడు రీడ్ హాఫ్మాన్ త‌న వ్యాసంలో రాశారు.

New H-1B Policy-USA-USCIS I 2305 I 38.5 శాతం తగ్గుదల
అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) చర్యల ఫలితంగా 2027 ఆర్ధిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 38.5 శాతం తగ్గింది. 2026 ఆర్ధిక సంవత్సరంలో 3,43,981 దరఖాస్తులు రాగా… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,11,600 మాత్రమే వచ్చాయి. ఆమోదం విషయంలో ఉన్నత డిగ్రీలు, అధిక వేతనాలు పొందుతున్న అభ్యర్థులకే అర్హ‌త ఇస్తున్న‌ట్లు యూ ఎస్సీఐఎస్ వివరించింది.

Also Read డ్రాగ‌న్ దూకుడు

Leave a Reply