బూత్ స్థాయిలో బలోపేతం చేయాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న

కడెం మే 23, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో మండలంలోని ధర్మాజిపేట్, న్యూ ధర్మాజిపేట్, లక్ష్మిసాగర్ గ్రామాల్లో బూత్ లెవల్ కమిటీల నియామక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు బొడ్డు గంగన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంలో బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.

అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి ప్రతి బూత్‌లో సమర్థవంతమైన కమిటీలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. యువత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కడం మండల యూత్ అధ్యక్షుడు రెంకాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడీకే మల్లేష్ సర్పంచ్‌లు సుమలత, శిరీష, సత్యం, రాజు నాయక్, నాయకులు ఎండి సలీమ్, దూల్లే వెంకటేష్, ముంజ ప్రసాద్, ముస్కు రాజేందర్, రాజేష్, యాదగిరి, లింబన్న, బీమేష్, ఉపసర్పంచ్‌లు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply