Pawankalyan | పేపర్ మిల్లు వ్యర్థ జలాలపై ఆకస్మిక తనిఖీ

Pawankalyan | పేపర్ మిల్లు వ్యర్థ జలాలపై ఆకస్మిక తనిఖీ
Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పర్యటన రెండో రోజున గోదావరి నది కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్‌నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు గోదావరిలో కలుస్తున్న ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించారు.
బోటు ప్రయాణం సందర్భంగా స్థానిక మత్స్యకారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కాలుష్యం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థ జలాల నమూనాలను అధికారులు సేకరించాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీల్లో ఆంధ్రా పేపర్ మిల్స్ కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో కాలుష్య వ్యర్థాలు కలవడం దారుణం. ఇలాంటి నీటిలో పుష్కర స్నానాలు చేస్తే పుణ్యం కాదు.. రోగాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఏలూరులో తాగునీటి కాలుష్యంతో జరిగిన మరణాలను గుర్తు చేశారు.
రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి ఎంత ముఖ్యమో.. పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై అసెంబ్లీ, కేబినెట్ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు.

