Delhi | సోనియా గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బీజేపీ ఎంపీలు నోటీసులు అందించారు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.
భారత రాష్ట్రపతిపై రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రపతి హోదాకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయిని.. ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌ను కోరారు.
అయితే, రాష్ట్రపతి తన ప్రసంగాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారని.. అలసిపోయారని పూర్ అంటూ సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్యాలు వివాదాస్పదంగా మారాయి.