Patna Jewellery Robbery Attempt | నగల దుకాణంలో దోపిడీకి యత్నం

Patna Jewellery Robbery Attempt | నగల దుకాణంలో దోపిడీకి యత్నం

పెప్పర్ స్ప్రేతో యజమానిపై దాడి.. ఇద్దరు యువతులు అరెస్ట్
పాట్నాలో సంచలనం.. నగలు దోచుకునేందుకు విఫలయత్నం
యజమాని అప్రమత్తతతో పట్టుబడ్డ ఇద్దరు యువతులు

Patna Jewellery Robbery Attempt | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీహార్ రాజధాని పాట్నాలోని దిఘా ప్రాంతంలో ఓ నగల దుకాణంలో దోపిడీ యత్నం కలకలం రేపింది. ఇద్దరు యువతులు నగలు దోచుకునేందుకు ప్రయత్నించగా, దుకాణ యజమాని అప్రమత్తతతో వారి ప్లాన్ విఫలమైంది. కుర్జీ బ్రిడ్జి సమీపంలోని ఓ జ్యువెలరీ షాప్‌కు వచ్చిన ఇద్దరు యువతులు ముందుగా దుకాణ యజమానిపై పెప్పర్ స్ప్రే చల్లి అచేతనుడిని చేయాలని ప్రయత్నించారు. అయితే పరిస్థితిని వెంటనే గ్రహించిన యజమాని దుకాణం బయటకు పరుగెత్తి సహాయం కోసం కేకలు వేశారు.

యజమాని అరుపులు విన్న సమీప దుకాణదారులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు యువతులను అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతులను అదుపులోకి తీసుకున్నారు. దోపిడీ యత్నానికి గల కారణాలు, వారి నేపథ్యం, ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.