AP బడ్జెట్ పై మంత్రి ప‌య్యావులు క‌స‌రత్తు

24న అసెంబ్లీలో ఎపి బ‌డ్జెట్
శాఖ‌ల వారీగా భేటీలు..
కేటాయింపుల‌పై మంత‌నాలు
నిధుల వేట‌కు భారీగా చ‌ర్చ‌లు

అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌భ – ఏపీ బడ్జెట్ పై పయ్యావుల ఫోకస్‌ చేశారు. ఈ నెల 24 న అసెంబ్లీలో బ‌డ్జెల్ ప్ర‌వేశ పెట్ట‌నున్న నేప‌థ్యంలో బడ్జెట్ రూపకల్పనపై ముమ్మర కసరత్తు మొదలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంత్రులు, ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తమ శాఖలకు కావాల్సిన నిధులు, ప్రవేశపెట్టనున్న పథకాలను సమీక్షల్లో మంత్రి పయ్యావులకు వివరించారు ఆయా శాఖల మంత్రులు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా పయ్యావులను కోరారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల. ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసే దిశగా ఆలోచిస్తామన్నారు పయ్యావుల కేశవ్. అటు ఫ్రీ బస్సుకు నిధులు పెట్టే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అమ్మ ఒడికి నిధులు కేటాయించాల్సి ఉంది.. ఎన్టీఆర్ రైతు భరోసాకు సైతం ఇచ్చే నిధుల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు ఆర్థిక మంత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *