3sixes | కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం
3sixes | కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం
3sixes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టుకు ఓపెనర్ ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. హెడ్ కేవలం 28 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అయితే, హెడ్ అవుటైన తర్వాత హైదరాబాద్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి (3/36) తన స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. నిర్ణీత 19 ఓవర్లలో సన్‌రైజర్స్ 165 పరుగులకే ఆలౌట్ అయింది.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓపెనర్లు అజింక్య రహానే (43), ఫిన్ అలెన్ (29) మంచి పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ బాధ్యతాయుతంగా ఆడి 59 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో కేకేఆర్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
CLICK HERE TO READ MORE : 1stwicket | రెచ్చిపోతున్న ట్రావిస్ హెడ్
