30-eggs-rs235 : గుడ్ల ధరలకు రెక్కలు Andhra Prabha Top News
30-eggs-rs235 : గుడ్ల ధరలకు రెక్కలు Andhra Prabha Top News
- ఒక్క గుడ్డు రూ.8
- సామాన్యులకు భారీ షాక్
- 30 గుడ్ల ట్రే రూ.235కు చేరిక
- ఏపీ ఆల్ టైం రికార్డు
( బాపట్ల, ఆంధ్రప్రభ )

30-eggs-rs235 : ఏపీ వ్యాప్తంగా గుడ్ల ధరలు మరోసారి పెరిగి వినియోగదారులకు భారంగా మారాయి. ఇటీవల వరకు రూ.180–200 మధ్య విక్రయమైన 30 గుడ్ల ట్రే ధర ప్రస్తుతం రూ.235కు చేరుకుంది. దీంతో ఒక్క గుడ్డు ధర సుమారు రూ.7.50 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. బాపట్ల హోల్సేల్ వ్యాపారస్తుడు నంబూరి కుమార్ రాజా తెలిపిన వివరాల మేరకు 40 సంవత్సరాలుగా కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నామని కరోనా సమయంలో ఏడు రూపాయల వరకు అమ్మిందని, తుఫాన్లు వరదలు విపత్తుల సమయంలో కూడా ఇంత ధర పలకలేదని తెలిపారు. ఇటీవల ఎగుమతులు ఆగిపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్లను అమ్మి వేయడం జరిగిందని కొన్ని పౌల్ట్రీలు మూసివేయటం జరిగిందని అన్నారు. ఇప్పుడు మరల ఎక్స్పోర్ట్ మార్కెట్ పుంజుకోవడంతో కోడిగుడ్లు సగం విదేశాలకు ఎక్స్పోర్ట్ కావడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడిందని తద్వారా అధిక రేట్లకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దానికి తోడు పౌల్ట్రీ రంగంలో ఉత్పత్తి వ్యయం పెరగడం, కోళ్ల దాణా ధరలు అధికమవడం, ఎల్ నినో ప్రభావంతో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో గుడ్ల ధరలు పెరిగినట్లు కుమార్ రాజా తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.గుడ్డు ప్రోటీన్‌కు ప్రధాన ఆహారంగా ఉండటంతో రోజువారీ వినియోగదారులు, చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, క్యాటరింగ్ రంగాలపై కూడా ఈ ధరల పెరుగుదల ప్రభావం చూపుతోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి రానున్న రోజుల్లో ధరల్లో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గుడ్ల ధరల పెరుగుదల సామాన్య కుటుంబాల నెలవారీ ఆహార వ్యయంపై అదనపు భారాన్ని మోపుతోంది.
