వైసీపీ శ్రేణులకు అనుసంధాన వేదికే ‘జగన్ 2.0 సూపర్ యాప్’

  • పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి..
  • పార్టీ శ్రేణులతో కలసి ‘Jagan 2.0 Super app’ ను ఆవిష్కరణ..

అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : వైయస్సార్ సీపీ నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య అనుసంధాన వేదికనే “జగన్ 2.0 సూపర్ యాప్” అని అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురము లోని హెచ్ ఎల్ సి కాలనీలో ఉన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు జగన్ 2.0 సూపర్ యాప్ ను పార్టీ శ్రేణులతో కలసి పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. కూటమి కుట్రలను తిప్పికొడుతూ వైయస్సార్ సీపీ కార్యకర్తలకు, నాయకులకు మధ్య అనుసంధానంగా ఉండాలనే సదుద్దేశంతో “జగన్ 2.0 సూపర్ యాప్” ఏర్పాటు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ జగన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.