మిషన్ భగీరథ పైప్‌లైన్ ఎంబీ రికార్డులపై అనుమానాలు.. చూపించేందుకు నిరాకరణ?..

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన ఎంబీ (మెజర్‌మెంట్ బుక్) రికార్డుల్లో నమోదైన కొలతల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత గ్రామ కార్యదర్శిని చరవాణి ద్వారా వివరణ కోరగా, “మాటల ద్వారా వివరాలు చెబుతాం కానీ ఎంబీ రికార్డులను చూపించలేం” అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.ఎంబీ రికార్డులను పరిశీలించేందుకు అవకాశం కల్పించకపోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులు పారదర్శకంగా అందుబాటులో ఉండాలని, సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.