కుటుంబ వివాదం సామరస్యంగా పరిష్కారం…

కుటుంబ వివాదం సామరస్యంగా పరిష్కారం…

పి. శశికళ ప్రకటన

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల చోటుచేసుకున్న కుటుంబ వివాదంపై న్యాయవాది భైరవ ప్రసాద్ సతీమణి పి. శశికళ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ పెద్దలు, మధ్యవర్తుల సమక్షంలో జరిగిన చర్చల ద్వారా తమ మధ్య ఉన్న విభేదాలు సామరస్యంగా పరిష్కరించుకున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాము ఎటువంటి విభేదాలు లేకుండా శాంతియుతంగా కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.

కుటుంబ విషయాలను రాజకీయాలతో ముడిపెట్టి కొందరు వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన భర్తపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం బాధాకరమని అన్నారు. కుటుంబ సమస్యను రాజకీయ రంగంలోకి తీసుకురావడం సరికాదని, దీనివల్ల అనవసర రాద్ధాంతం జరుగుతోందని తెలిపారు. తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఈ విషయంపై మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని ఖండిస్తున్నామని పి. శశికళ స్పష్టం చేశారు.

Leave a Reply