ఇంద్రకీలాద్రిపై భ‌క్తజ‌నం పరవళ్లు

ఇంద్రకీలాద్రిపై భ‌క్తజ‌నం పరవళ్లు

  • మూడు రోజులుగా భవానీల తాకిడీ
  • బెజవాడలో ఉత్తరాంధ్ర సందోహం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ(Sri Kanakadurgamma) దర్శనానికి వస్తున్నభవానీ భక్తజన కెరటాలతో ఇంద్రకీలాద్రి పోటెత్తుతోంది.. మునుపెన్నడూ లేనంతగా భవానీలు ఎల్లలు, ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి తరలివస్తున్నారు. ఇంద్రకీలాత్రికి(Indrakilatri) ఉప్పొంగిన‌ భవాని భక్త జన ప్రవాహంతో ఎక్కడ‌ చూసినా, ఏ పరిసరాల్లో చూసినా భవానిలే దర్శనమిస్తున్నారు.

భవాని మాల(Bhavani Mala) విరమణ కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో క్యూలైన్లు కనకదుర్గ నగర్ ఘాట్ రోడ్డు కెనాల్ రోడ్డు వీఎంసీ కార్యాలయం వద్ద రహదారి స్నాన్పుగాట్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్న భవానీలతో ఇంద్రకీలాద్రి మొత్తం కోలాహలంగా మారి పూర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

విజయదశమి పర్వదినం మ‌రుస‌టి రోజు నుండి అధికంగా ఉన్న భవానీల రాక క్రమక్రమంగా పెరిగిన నేపథ్యంలో అధికారులు అన్ని క్యూ లైన్‌లలో ఉచితంగా భవానీలను అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి భవాని దీక్షపరులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని, గాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, హోల్డింగ్ ఏరియా(Holding Area)లలో అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తూ వినాయక గుడి క్యూలైన్ల ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని మనసారా వీక్షిస్తున్నారు.

అమ్మవారి దర్శనానంతరం శివాలయం మెట్ల మార్గం ద్వారా కనకదుర్గ నగర్ చేరుకుని అక్కడ కొత్తగా ఉన్న అన్నప్రసాద భవనంలో అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి, లడ్డూలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చిన భవానీల రాక కారణంగా కిక్కిరిసిన క్యూలైన్లతో అమ్మవారి దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతుంది. కనకదుర్గ నగర్‌(Kanakadurga Nagar)తో పాటు ఇంద్రకీలాద్రి ఏ ప్రాంతంలో చూసినా అరుణ వర్ణ శోభితంగా కనిపిస్తోంది.

గడిచిన మూడు రోజుల నుండి లక్షల సంఖ్యలో తరలివస్తున్నభవానీల రాక దృశ్య అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భవానీలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్నానపు ఘాటులు కేశఖండనశాల(Kesakhandanashala) క్యూ లైన్లు, అన్న ప్రసాదం, లడ్డు ప్రసాద్ విక్రయ కేంద్రాలు వంటి ప్రాంతాలలో నిగాతో పాటు అవసరమైన చర్యలు చేపట్టారు.

అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భవానీలకు క్యూలైన్లలో అవసరమైన వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు(Water Bottles, Biscuit Packets) అందించడంతో పాటు 24 గంటల పాటు అమ్మవారి అన్నప్రసాదాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. క్యూలైన్లలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఈవో శీనా నాయక్, నూతన దుర్గ గుడి చైర్మన్ బుర్ర గాంధీలు క్షేత్రస్థాయిలో పర్యటించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అలాగే చైర్మన్ గాంధీ స్వయంగా బిస్కెట్ ప్యాకెట్లను భవానీలకు పంచి పెడుతున్నారు.

Leave a Reply