మృతుని కుటుంబానికి ఆర్ధిక చేయూత..

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన పెయింటర్ కూరెళ్ల రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పెయింటింగ్ యూనియన్ అధ్యక్షులు కూరెళ్ళ కృష్ణ,పెయింటర్స్ బూడిద మల్లేష్, కూరెళ్ళ రమేష్, కూరెళ్ల సామెలు, కూరెళ్ళ వెంకటేష్ , ప్రశాంత్, టీంకు, మహేష్ ,పల్లె నవీన్,నల్ల సాగర్,మెంట నవీన్ , కూరెళ్ళ కళ్యాణ్,వస్తుప్పల వినోద్, చెడిపెల్లి అజేయ్, కూరెళ్ళ సందీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.