ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్నరేకుల షెడ్డుల తొలగింపు

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులను ఆర్ అండ్ బి అధికారులు గురువారం తొలగించారు. ప్రధాన రోడ్డుకు ఆనుకొని కొందరు రేకుల షెడ్డ్డులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గ్రహించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. రోడ్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.