ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులు

టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ వీరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అవిశ్రాంతంగా పోరాడిన ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూయడంతో టేకుమట్లలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సంతాపం తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, నాయకులు బందెల నరేష్, పోతన వేణి ఐలయ్య, మాట్ల శ్రీనివాస్, బొడ్డు సదానందం, నిమ్మల స్వామి, మారం లింగారెడ్డి, పొన్నం చంద్రయ్య, అనవేన రమేష్, ఎండీ అక్రమ్, బందెల శ్రీనివాస్, అబ్బేంగుల రాజయ్య, కుమారస్వామి, పున్నం తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.