మోత్కూర్ ఐసిడిఎస్ సిడిపిఓ బాధ్యతల స్వీకరణ
మోత్కూర్ ఐసిడిఎస్ సిడిపిఓ బాధ్యతల స్వీకరణ
మోత్కూరు, ఆంధ్రప్రభ: మోత్కూరు ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్టు నూతన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO)గా వి.నాజీ నియమితులయ్యారు. బదిలీపై వచ్చిన ఆమె శనివారం మోత్కూరులోని కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
హయత్ నగర్ నుండి మోత్కూరుకు.. గతంలో హయత్ నగర్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో సిడిపిఓగా విధులు నిర్వహించిన వి.నాజీ, ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా మోత్కూరుకు విచ్చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు.
ముగిసిన ఇన్ఛార్జ్ బాధ్యతలు
మోత్కూరులో గతంలో పనిచేసిన సిడిపిఓ జోష్న పదవీ విరమణ పొందడంతో ఇక్కడి పోస్ట్ ఖాళీగా ఉంది. అప్పటి నుండి భువనగిరి సిడిపిఓ యామిని ఇన్ఛార్జ్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు పూర్తిస్థాయి అధికారిగా నాజీ బాధ్యతలు స్వీకరించడంతో పాలనాపరమైన పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఆమె బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది, సూపర్వైజర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
