పూజారి కుటుంబానికి కాంగ్రెస్ అండ

మేడారంలో పాపారావు కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
దశదిన కర్మల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క తల్లి ఆలయ పూజారి సిద్ధబోయిన పాపారావు అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మేడారం సర్పంచ్ పీరీల భారతి–వెంకన్న ఆధ్వర్యంలో పాపారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దశదిన కర్మల నిర్వహణ కోసం కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పాపారావు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ అనీల్ కుమార్, ఉపసర్పంచ్ ఆలకుంట వనిత–కృష్ణ, అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన బోజారావు, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రానా రమేష్, వార్డు సభ్యుడు సిద్ధబోయిన జనార్ధన్, మండల నాయకులు అట్టం సమ్మయ్య, సిద్ధబోయిన వెంకటేష్, అట్టం రమేష్ తదితరులు పాల్గొన్నారు.