స్వాతి రోడ్డు–రైతుబజార్ లింక్ రోడ్డు త్వరగా పూర్తి చేయాలి…
మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య
బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధికి వినతి
కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి
స్థానిక ప్రజల రాకపోకలకు లింక్ రోడ్డు ఎంతో అవసరమని వెల్లడి
భవానిపురం, జులై 31 (ఆంధ్రప్రభ): “స్వాతి రోడ్డు నుంచి రైతుబజార్‌కు వెళ్లే లింక్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫైల్ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉంది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి” అని మాజీ కార్పొరేటర్, క్లస్టర్ ఇన్చార్జి యేదుపాటి రామయ్య కోరారు. ఈ మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బుద్ధా వెంకన్నకు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి శ్రీధర్‌కు ఆయన వినతిని తెలియజేశారు.
స్వాతి రోడ్డు–రైతుబజార్ లింక్ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలు సులభతరమవుతాయని, ట్రాఫిక్ సమస్యలు కూడా గణనీయంగా తగ్గుతాయని వివరించారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు తక్షణ ఆమోదం లభించేలా చర్యలు తీసుకుని, లింక్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని యేదుపాటి రామయ్య విజ్ఞప్తి చేశారు.
