july10th Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24గంట‌లు
శిలాతోరణం వరకు క్యూ లైన్..
వీకెండ్ ప్రారంభంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుదల
నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన టీటీడీ

july10th Tirumala | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం కావడంతో పాటు వారాంతపు సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌ఎస్‌డీ (స్లాటెడ్ సర్వదర్శనం) టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూలైన్‌లో ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో శుక్రవారం ప్రారంభమైన ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు, భద్రత, పరిశుభ్రత వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, దర్శనానికి తగిన సమయాన్ని కేటాయించాలని సూచించారు.

జూలై 9, 2026 నాటి టీటీడీ గణాంకాలు:

మొత్తం దర్శించుకున్న భక్తులు: 70,141 మంది
తలనీలాలు సమర్పించిన భక్తులు: 33,821 మంది
హుండీ ఆదాయం: రూ.4.23 కోట్లు
విక్రయించిన లడ్డూలు: 4.05 లక్షలు
అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు: 2.62 లక్షల మంది
వైద్య సేవలు పొందిన భక్తులు: 3,586 మంది
వైకుంఠం క్యూ కాంప్లెక్స్: అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి
సర్వదర్శనం క్యూ: శిలాతోరణం వరకు
టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి అంచనా నిరీక్షణ సమయం: 24 గంటలు