దిబగుంట్ల గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..

దిబగుంట్ల గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణకు, ప్రజల భద్రత, రక్షణ ధ్యేయంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నేరాలను ముందస్తుగా అరికట్టి, ప్రజల్లో భద్రతా వాతావరణాన్ని బలపరచాలని,ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం స్పష్టంగా కనిపించేలా, మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ ఏ ఎస్ పి ఎం. జావళి సూచనలతో ఆదివారంతెల్లవారుజామున గోస్పాడు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తమ సిబ్బంది తో దీబగుంట్ల గ్రామం నందు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

అనుమానాస్పద ప్రదేశాలు తనిఖీలు నిర్వహించడంతో పాటు రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారి ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాక మాదకద్రవ్యాలు రవాణా, విక్రయం, వినియోగించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించరు. సైబర్ భద్రత, రోడ్డు ప్రమాదాల, సీసీ కెమెరాలు ఏర్పాటు, బాల్యవివాహాలు, కొత్త చట్టాలు మొదలగు వాటిపై అవగాహన కల్పించారు.

గ్రామాలలో ఏదైనా సమస్య ఉంటే ముందుగా పోలీసు దృష్టికి తీసుకొని రావాలని చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమం లో పోలీసులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply