పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవం
పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం నేటి కాలంలో అత్యంత అవసరమన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్య ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
భావితరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని వాతావరణాన్ని అందించేందుకు సమాజంలోని ప్రతి వర్గం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రూపొందించిన అవగాహన పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రకృతి వనరుల సంరక్షణ, నీటి పొదుపు, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, చెట్ల పెంపకం వంటి అంశాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీఓ రవి, తహసీల్దార్ ప్రసాదరావు, సర్పంచ్ మునిగడప లావణ్య, ఉప సర్పంచ్ గొడిశాల రాజు, కార్యదర్శి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
