ఉద్యోగుల కంటే ముందే పింఛన్లు..
ఉద్యోగుల కంటే ముందే పింఛన్లు..
పుట్టపర్తి అభివృద్ధికి మరో భారీ శుభవార్త..!
కొత్తచెరువు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగానే ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.
కొత్తచెరువులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మొత్తాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే అత్యధిక మొత్తంలో సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. పేదల సంక్షేమం, అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి భారీ పరిశ్రమలు గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయని తెలిపారు. రూ.1.51 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయని, వీటి ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.
ఈ పరిశ్రమలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడతాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాలెక్కగారి వాణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ, టీడీపీ కన్వీనర్లు వలిపి శ్రీనివాసులు, రామకృష్ణ, సొసైటీ అధ్యక్షులు హరిప్రసాద్, నాగేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, ప్రకాశ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కిలారి శ్రీనాథ్, నాగేంద్ర, భాస్కర్, చికెన్ బాషా, హర్ష, విజయ్, రామకృష్ణ, పీవీ రమేష్, జేసీబీ శ్రీనాథ్, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
