ప్రశాంత వాతావరణమే పోలీస్ వ్యవస్థ ధ్యేయం

ప్రశాంత వాతావరణమే పోలీస్ వ్యవస్థ ధ్యేయం

పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ను నేరరహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని నార్త్ ఏసీపీ సత్యానందం అన్నారు. సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ డి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సింగ్ నగర్ పరిధిలోని ఆచ్చర్యమైన కృపా మందిరంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా న్యూ రాజరాజేశ్వరి పేట, లూనా సెంటర్, లెనిన్ సెంటర్, రామానగర్, ఎక్సెల్ ప్లాంట్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు నిఘాను ముమ్మరం చేశామని తెలిపారు.

ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి విక్రేతలు, రవాణాదారులతో పాటు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే బ్లేడ్ బ్యాచ్ సభ్యులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇలాంటి ముఠాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ, పట్టుబడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని సిఐ తెలిపారు.

రాత్రి సమయాల్లో రౌడీషీటర్లు తమ ఇళ్లల్లో ఉంటున్నారా? లేదా ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు ప్రణాళికలు వేస్తున్నారా? అనే కోణంలో ఆకస్మిక తనిఖీలు (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూసినా, అనవసరమైన గొడవల్లో తలదూర్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వారిపై తక్షణమే కొత్తగా రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐ డి. చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్, పాస్టర్ బాజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply