కోఆప్షన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్‌పల్లి పురపాలక సంఘంలో కోఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు.

కోఆప్షన్ సభ్యుడిగా పోటీ చేయదలచిన అభ్యర్థులు జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ధ్రువపత్రాలతో పాటు దరఖాస్తులను క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

మైనారిటీ కోటా కింద పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థుల పేరు మున్సిపాలిటీ ఓటరు జాబితాలో నమోదై ఉండాలని, వారి వయస్సు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు.

అదనంగా, గ్రామ పంచాయతీ లేదా పురపాలక సంస్థలో ప్రజాప్రతినిధిగా కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నట్లు కమిషనర్ వెల్లడించారు.

Leave a Reply