మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసిన నూతన పీఓ

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసిన నూతన పీఓ
ఉట్నూర్, ఆంధ్రప్రభ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ నూతన ప్రాజెక్టు అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన మంద మకరంద మంగళవారం గిరిజన ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీప్ సెక్రెటరీ శ్రీ సవ్యసాచి ఘోష్ ను వేరువేరుగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా నూతన పీఓ గిరిజన అభివృద్ధి అమలవుతున్న పథకాలు గిరిజన అభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రణాళికల గురించి వారితో చర్చించినట్లు ఉట్నూర్ ఐటీడీఏ నూతన పీఓ మంద మకరంద తెలిపారు.
