శ్రీ పడమటి ఆంజనేయస్వామి జాతరకు రండి

శ్రీ పడమటి ఆంజనేయస్వామి జాతరకు రండి

  • ఘనంగా హనుమాన్ హోమం, రథోత్సవం

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎల్బీనగర్ వీధిలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి జాతర వేడుకలకుభక్తులు, భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నింగిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలుసూర్యప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్కోటి జనార్దన్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ పిలుపునిచ్చారు.

మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎల్బీనగర్ ఆంజనేయస్వామి4వజాతర గోడపత్రికలువిడుదలచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది పడమటి ఆంజనేయస్వామి జాతర వేడుకలు రెండు రోజులపాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతాయనిఅన్నారు. ఈనెల 30న గురువారం ఉదయం 7 గంటలకు అభిషేకం, 8 గంటలకు అలంకార తీర్థ ప్రసాదవితరణ, 9 గంటలకు హనుమాన్ హోమం, మహా మంగళ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వచ్చేనెల 1న శుక్రవారం ఉదయం 6 గంటలకు కలశం ఊరేగింపు శ్రీరాంనగర్ ఆంజనేయస్వామి దేవాలయం నుండి ఎల్బీనగర్ హనుమాన్ దేవాలయం వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 7:30 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం అలంకారం మహా మంగళహారతి సాయంత్రం 5:30 గంటలకు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవ వేడుకలు మహా మంగళ హారతి సాయంత్రం 7 గంటలకు చిన్నారులతో వివిధ సంస్కృతిక నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుతెలిపారు. రెండు రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టే జాతర రథోత్సవ వేడుకలు విజయవంతంచేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply