సంకీర్త్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి తనయుడు, సుశీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంకీర్త్ రెడ్డిని చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్బనబోయిన రాము యాదవ్ కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సంకీర్త్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లెంకల్లపల్లి ఉపసర్పంచ్ మెతరి శంకర్, దాడి యశ్వంత్ రెడ్డి, పున్న మహేష్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.