రీ-నీట్ 2026 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల

  • అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తుది కీ..
  • ఇక అభ్యంతరాలకు అవకాశం లేదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) రీ-నీట్ యూజీ 2026 తుది ఆన్సర్ కీని గురువారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో తమ ప్రశ్నాపత్రం సెట్‌కు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాత్కాలిక ఆన్సర్ కీపై అభ్యర్థులు పంపిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం ఈ తుది ఆన్సర్ కీని విడుదల చేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది. దీంతో ఇకపై దీనిపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి…

అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే “Re-NEET 2026 Final Answer Key” లింక్‌పై క్లిక్ చేయాలి. ఆన్సర్ కీ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తమ ప్రశ్నాపత్రం సెట్ (50, 60, 70 లేదా 80)కు సంబంధించిన సమాధానాలను చెక్ చేసుకోవ‌చ్చు.