CBSE Evaluation Row | సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ విమర్శలు

CBSE Evaluation Row | సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ విమర్శలు
CBSE Evaluation Row | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎమ్) మూల్యాంకన విధానంపై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మూల్యాంకన లోపాల కారణంగా విద్యార్థులు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
ఒక విద్యార్థి తన జవాబు పత్రాన్ని సరిగా మూల్యాంకనం చేయించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పటికే 4 లక్షల మందికి పైగా విద్యార్థులు రీవాల్యుయేషన్, జవాబు పత్రాల కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ ద్వారా సీబీఎస్‌ఈ ఎంత మొత్తంలో ఆదాయం పొందుతోందో ప్రజలు గమనించాలన్నారు.
మూల్యాంకనంలో జరిగిన లోపాల కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఎస్‌ఈ చేసిన తప్పిదాలు విద్యార్థులకు శిక్షగా మారాయని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితులు తలెత్తకుండా పారదర్శకమైన మూల్యాంకన వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రాహుల్ గాంధీ కోరారు.
