టిపిసిసి అధ్యక్షుడిని కలిసిన కాంగ్రెస్ నాయకులు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిజ్వార్ గ్రామానికి చెందిన పూజారి నాగేష్ గౌడ్‌కు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తిపై మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కోటి జనార్దన్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయసింహారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు రాఘవేందర్ గౌడ్, ఎరుకలి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
