NEET Topper TG | నీట్‌ టాపర్లకు సీఎం అభినందన‌లు

గురుకుల విద్యార్థుల ప్రతిభపై ప్రశంసలు

NEET Topper TG | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS)లో చదివి నీట్‌ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లోని MCRHRDలో సీఎం రేవంత్ రెడ్డిని గురుకుల పాఠశాలలకు చెందిన నీట్‌ ర్యాంకర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను సీఎం ప్రశంసించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

నీట్‌ ర్యాంకర్లతో పాటు తొలి ఆసియా అండర్‌-23 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవల్లిక కూడా సీఎంను కలిశారు. ఆమెను సీఎం అభినందించి భవిష్యత్‌ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి, TGSWREIS కార్యదర్శి (FAC) కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.