రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్

రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్
కేసీఆర్ నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని కొందరు అనుకుంటున్నారని, ఉద్యమకారులు అనే పదాలు వారికి వారే రాసుకుంటున్నారని ఆరోపించారు. చరిత్రలో చాలా మంది స్వేచ్ఛ కోసం పోరాటాలు చేశారు. నిజాంలకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి పోరాడారు. ఆయన ఐదు వందల ఎకరాల భూమిని పేదలకు పంచారు. 1952 లో తొలి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎం పీగా గెలిచినా, తర్వాత పోటీ నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఓడించినా, కొందరు పదవులు వదులుకోవడం లేదన్నారు. కేసీఆర్ కి నోటీసులు ఇస్తే ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలు పెడుతున్నారు. కోదండరాం ఉద్యమకారుడు కాదా ఆయనను మీ పాలనలో ఎలా అరెస్ట్ చేశారో మర్చిపోయారా? అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
