స్థానిక సంస్థ ఎన్నికల్లో మాసత్తా చూపిస్తాం..

  • జనసేన పార్టీకి నాలుగు శాతం కూడా లేని ఓటు బ్యాంకు..
  • మీరా మాట్లాడేది జగన్ గురించి దీపికమ్మ గురించి..
  • బిసి సెల్ నియోజవర్గ అధ్యక్షులు రామాంజనేయులు

హిందూపురం, ఆంధ్రప్రభ : సత్య సాయి జిల్లా హిందూపురం ఇటీవల కాలంలో దాదాపు 15 రోజుల నుండి పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుందని అయితే మా వైయస్సార్సీపి పార్టీ గురించి మాట్లాడే అర్హత ప్రభుత్వానికి గాని ముఖ్యంగా జనసేన పార్టీకి గాని ఏమాత్రం లేదని నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మానేంపల్లి రామాంజనేయులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రౌడీలకు రాజ్యాంగ మారిపోయింది అన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు.

ఇటీవల ఒక ఎమ్మెల్యే మా వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అసభ్యంగా మాట్లాడిన తీరు మొత్తం రాష్ట్రమంత తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇక అదే విధంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి శ్రీకాంత్ అనే వ్యక్తిని వివచిచక్షణారహితంగా మూడు రోజులపాటు నిర్బంధించి మానసికంగా హింసించడం కొట్టడం జరిగింది అన్నారు. పోలీసులు కూటమి ప్రభుత్వం చేతిలో కీళ్ల బొమ్మలుగా మారిపోయారు అన్నారు. బీసీ కురువ శ్రీకాంత్ ను విచక్షణా రహితంగా కొట్టిన పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక ముఖ్యంగా నియోజకవర్గ విషయానికి వస్తే హిందూపురం నియోజకవర్గం లో జనసేన పార్టీ హుసే లేదన్నారు. నియోజవర్గంలో వెతికి చూసిన సరైన నాయకుడు లేడు అన్నారు. కనీసం రెండు శాతం ఓడిపోయాక కూడా ఈ నియోజకవర్గంలో లేదన్నారు. వీరా మా పార్టీ గురించి మాట్లాడేది అని విమర్శించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ సత్తా ఏదో చూపించాలని మాసత్తా ఏదో చూపిస్తామని రామాంజనేయులు ధ్వజమెత్తారు. లేపాక్షి మండలంలో వైసిపి జెండా రెపరెపలాడుతుందని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.

హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయదుంద విమోగిస్తుందన్నారు. పోలీసులు కూడా ఎటువంటి రాజకీయాలు చేయకుంటే ఇంకా మంచి మెజారిటీతో మా అభ్యర్థులు గెలుస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏదేమైనా హిందూపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉనికి కోల్పోయిందని జనసేన పార్టీలో సరైన నాయకత్వ లక్షణాలు లేకుండా ఉండడంతోనే మా పార్టీలోకి జనసేన పార్టీ నుంచి వలసలు వస్తున్నారన్న విషయాన్ని ఆయన తెలిపారు. ఇలాంటి నిజాలు జీర్ణించుకోలేక చిల్లరి రాజకీయాలు చేస్తున్నారని ఖబర్దార్ అంటూ రామాంజనేయులు తెలిపారు.