tirumala| కొండ నిండా…
tirumala| కొండ నిండా…
తిరుమల కిటకిట..
శిలాతోరణం వరకు క్యూ..
సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి
ఒక్క రోజులో 82,172 మంది శ్రీవారి దర్శనం..
హుండీ ఆదాయం రూ.5.15 కోట్లు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తిరుమలలో భక్తుల రద్దీ గురువారం కూడా కొనసాగుతోంది. సాధారణంగా జూలై నెలలో భక్తుల రద్దీ కొంత తగ్గుముఖం పడుతుందని భావించినప్పటికీ, ఈసారి మాత్రం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రద్దీ ఇంకా తగ్గకపోవడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనం కోసం క్యూ లైన్‌లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం కలగడానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
జూలై 9న మొత్తం 82,172 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 36,978 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.5.15 కోట్ల ఆదాయం లభించింది. అదే రోజు 4.25 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.57 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమలలోని వైద్య సేవల ద్వారా 3,234 మందికి చికిత్స అందించినట్లు టీటీడీ వెల్లడించింది.
