జగనన్న 2.0 యాప్‌ ఆవిష్కరణ..

  • ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు

నందిగామ, ఆంధ్రప్రభ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నందిగామలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలిసి జగనన్న 2.0 యాప్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీకి చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా జగనన్న 2.0 యాప్‌ను తమ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు, సమాచారం, కార్యకలాపాలకు ఈ యాప్ దిక్సూచిలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.