సేవలకు సలాం…

సేవలకు సలాం…

గోనెల నానికి నంది అవార్డు…

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు కు చెందిన సామాజిక సేవకుడు గోనెల నాని సమాజ సేవలో చేసిన విశిష్ట కృషికి గాను నంది అవార్డు అందుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆపద్బాంధవుడిగా ముందుకు వచ్చి అనేక మందికి సహాయం అందించడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. కరోనా కాలంలో అవసరమైన వారికి ఆహారం, ఔషధాలు అందించడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించి బాధితులకు అండగా నిలిచారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా నిలిచి తన సేవాభావాన్ని చాటుకున్నారు.

అలాగే వరదల సమయంలో ప్రమాదంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి భోజన సదుపాయం కల్పించడం వంటి చర్యల ద్వారా గోనెల నాని విశేష సేవలు అందించారు. ఆయన సేవలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ఇప్పటివరకు 27 సార్లు రక్తదానం చేసి అనేకమంది ప్రాణాలను కాపాడటంలో భాగస్వామి కావడం ఆయన సేవా తపనకు నిదర్శనం. సమాజ సేవలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గోనెల నానికి నంది అవార్డు ప్రదానం చేయడం జరిగింది..

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, నాయకులు ఆయన సేవలను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.తనకు నంది అవార్డు రావటంలో తను చేసిన సేవా కార్యక్రమాలు ను పత్రిక లు ప్రచురించి గొప్పగా ప్రచురించటం తో నంది అవార్డు ఇవ్వటం జరిగిందని ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెంచిందని అవార్డు గ్రహీత నాని తెలిపారు.భవిషత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

Leave a Reply