కారు–బైక్ ఢీ…
కారు–బైక్ ఢీ….
- బైక్ రైడర్ పరిస్థితి విషమం
- ఊరుకొండ పేటలో ఘటన
- హైదరాబాద్కు తరలింపు
ఊరుకొండ, ఆంధ్రప్రభ : కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఊరుకొండ పేటలో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఊరుకొండ పేట గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ డ్రైవర్ ఎండి ఖుర్షీద్ బైక్పై ఊరుకొండ వైపు వెళ్తుండగా, వంగూరు మండలం మాచినోని పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తన కారులో వస్తున్నారు.
రోడ్డు మూలమలుపు వద్ద ఇరు వాహనాలు ఢీకొనడంతో ఎండి ఖుర్షీద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
