AWARD| ప్లాటినం అవార్డ్ అందుకున్న మైహోమ్ టీం..

AWARD| మేళ్ళచెరువు, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మెల్లచెరువు మండల కేంద్రంలోని మైహోం సిమెంట్ పరిశ్రమకు హెల్త్ అండ్ సేఫ్టీ విభాగంలో ప్లాటినం అవార్డ్ దక్కింది. ఎపెక్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయపూర్ లో నిర్వహించిన భారతదేశంలోని సిమెంట్ ఇండస్ట్రీస్ కేటగిరిలో మై హోమ్ ఇండస్ట్రీస్ కు ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ విభాగంలో ప్లాటినం అవార్డు దక్కింది. ఈ అవార్డును సంస్థ ప్రతినిధి యన్.వేణు నాయుడు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తమ సంస్థకు వచ్చిన సందర్భంగా సంస్థ యూనిట్ హెడ్ యన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అవార్డు రావడానికి కృషి చేసిన టీమ్ మెంబర్స్ అందరికీ అభినందనలు తెలియజేశారు. ఇటువంటి అవార్డులు భారతదేశంలోని మంచి ప్రతిభను కనపరిచిన పరిశ్రమలకు వస్తాయని, పరిశ్రమ అభివృద్ధి తో పాటు పరిశ్రమ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల ఆరోగ్య విద్యా ఉపాధి వృద్ధికి ఎప్పుడూ ముందుటారని అన్నారు.

Leave a Reply