మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
కేసముద్రం, ఆంధ్రప్రభ:
కేసముద్రం మండల కేంద్రంలో మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం శ్రీనివాస్, జిల్లా గౌరవ సలహాదారు, అడ్వకేట్ తుంపిళ్ల శ్రీనివాస్, మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కమటం శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, యువత సమాజ ప్రగతికి చోదక శక్తులని అన్నారు. సంఘం బలోపేతానికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు యువత విద్యా, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించేందుకు ఈ అసోసియేషన్ వేదికగా నిలుస్తుందని తెలిపారు.
ఈ ఆవిర్భావ సమావేశంలో మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కేసముద్రం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొణతం సుభాష్, ప్రధాన కార్యదర్శిగా తోట సందీప్, కోశాధికారిగా తోట భరత్ ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా కముటం రాహుల్, బండి వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా కముటం వంశీ, ప్రచార కార్యదర్శులుగా తుంపిళ్ల రమేష్, కముటం రాకేష్, కార్యవర్గ సభ్యుడిగా లక్కాకుల వంశీ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి కముటం స్వామి (ఎల్‌ఐసీ), కోశాధికారి సింగంశెట్టి ఏకాంతం, కేసముద్రం టౌన్ ప్రెసిడెంట్, మున్సిపల్ కౌన్సిలర్ ఆగే రాము, గ్రామ మున్నూరు కాపు అధ్యక్షుడు కమటం శ్రీరంగం, లక్కాకుల నరసయ్య పాల్గొన్నారు.
అలాగే మున్నూరు కాపు పరపతి సంఘం అధ్యక్షుడు మాసాడి శ్రీనివాస్, పరపతి సంఘం కోశాధికారి కముటం శ్రీధర్, మున్నూరు కాపు సాంకేతిక విభాగం అధ్యక్షుడు పిన్ని రాము (న్యాయవాది), బొల్లు సోమేష్, లక్ష్మణ్, బండి రంజిత్, కొణతం రాంచందర్, మాసాడి అశోక్, తోట మోహన్, మార్తా సతీష్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
