గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి

గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి

  • సీపీఐ నాయకులు

భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ ; భూ పోరాటంలో గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే వరకు సిపిఐ పార్టీ ప్రతి పేదవాడి పక్షాన ఉంటుందని చలో అసెంబ్లీ మహాధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా మహాధర్న కార్యక్రమానికి భీమదేవరపల్లి మండల సిపిఐ పార్టీ నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదర్శ తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి నేతృత్వంలో మండలంలో భూ పోరాటంలో భాగంగా గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలి ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఆదరి రమేష్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మంచాల రమాదేవి, నాయకులు సుంచు కుమార్, కవ్వంపల్లి కిషన్, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply