అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ అక్రమ రవాణాకు అడ్డంకి వేస్తున్నారు. దేవక్కపల్లి సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న అశోక్ లేలాండ్ టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, రేణికుంట గ్రామ పరిధిలోని మొయ్యతుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఈ కేసులో సిద్ధిపేట జిల్లా చెందిన హరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, టిప్పర్ వాహనంతో పాటు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్‌ఐ మాట్లాడుతూ, “అనుమతులు లేకుండా ఇసుక తవ్వకం, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము” అని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply