ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ..

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలలు కలిపి మొత్తం 59 పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, లైబ్రరీ పుస్తకాలు, ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

మొత్తం 12,410 పాఠ్యపుస్తకాలు, 25,580 నోట్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ షేక్ ఖాదర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వెన్ను భిక్షపతి, ఐఈఆర్‌పీ పత్తిపాక ఉపేందర్, సీఆర్పీలు చీర మురళి, ఇస్సంపల్లి ఉదయ్, మహ్మద్ సుల్తానా, నేరెళ్ల పద్మ, బండారు స్వాతి, నేలకొండ నాగవాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply