Short Circuit | ఆదుకోవాలని సీఎం ఆదేశం…

Short Circuit | ఆదుకోవాలని సీఎం ఆదేశం…

Short Circuit | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం అన్నదాతల కళ్లల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న, వరి, జొన్న పంటలు అగ్నికి ఆహుతై క్షణాల్లో బూడిదయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

ఎంతో శ్రమించి పండించిన పంటలు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో రైతుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. పొలాల్లో ఎగిసిపడిన మంటలు పంటలను పూర్తిగా దహనం చేశాయి.

Short Circuit |

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నష్టపోయిన రైతుల వివరాలను వెంటనే సేకరించి, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

CLICK HERE TO READ MORE : Rs20 Crore Scam : కదిరిలో భూ మాయం Andhra Prabha Top Story

CLICK HERE TO READ MORE :