Coordination | పార్టీ వీడనున్న కాంగ్రెస్ శ్రేణులు
Coordination | పార్టీ వీడనున్న కాంగ్రెస్ శ్రేణులు
Coordination | వాంకిడి, ఆంధ్రప్రభ : పనితనం కొందరిది పెత్తనం పదవులు మరి కొందరికి ఇది ఎంత వరకు సమన్యాయం(balance) అని వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్నులే నారాయణ ధ్వజమెత్తారు. కొందరు కొత్తగా పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారని, అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అధికార పెత్తనంతో పాటుగా పదవులు సైతం వారినే వరిస్తున్నాయని ఆరోపించారు.
ఇలా అయితే రానున్న రోజుల్లో మూకుమ్మడిగా పార్టీని వీడాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఎల్లకాలం పార్టీలో ఉన్న వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు. పనితనం కొందరిది అయితే పెత్తనం పదవులు కొత్తవారికా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ అధిష్టానం(party leadership) తగు చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తికి డైరెక్టర్ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అదే విదంగా పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలకు పదవి ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తికి కేటాయించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న వచ్చిన వారికి చైర్మన్ పదవి అప్పగించారని వాపోయారు.
శ్యామ్ నాయక్ వర్గాలకు చెందిన వ్యక్తులకు డైరెక్టర్లుగా పదవులు ఇవ్వడం సమంజసం కాదని భావించారు. కనీసం మండల అధ్యక్షులకు, సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ నాయక్(Shyam Nayak) మండలంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమకు సమీప కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ దీపక్ ని అడిగి డైరెక్టర్ల పేర్లను ఖరారు చేయడంతో మీడియా సమావేశం(media conference) నిర్వహించామని ఆగ్రహించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ లకు తెలియకుండా అన్యాయం జరిగిందని అన్నారు. అందరూ కలసి పార్టీకి రాజీనామా చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తదితులున్నారు.
