ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు..
- ఇంద్రకీలాద్రిలో విశేష పూజలు
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆధ్వర్యంలో ఎంపీ పేరుమీద గోత్రనామాలతో పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని దేవతలను ప్రార్థించారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదినం సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థాన పాలకమండలి సభ్యురాలు మన్నే కలావతి ఆధ్వర్యంలో ఎంపీ గారి పేరుమీద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయంలో కూడా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత విజయాలు సాధించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు బోర్డు సభ్యురాలు సుఖవాసి సరితతో పాటు పలువురు పాల్గొన్నారు.
