భక్తులతో కిటకిటలాడిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం

మోపిదేవి, ఆంధ్రప్రభ ; మోపిదేవి లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ప్రత్యేకత కావడంతో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. నాగపట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ కార్య నిర్వాహనాది కారి దాసరి శ్రీరామవర ప్రసాదరావు ఆధ్వర్యంలో సహాయక ఉద్యోగులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Leave a Reply